ఆర్‌కామ్ ఆర్థిక సంక్షోభం... జియోకు రూ.2 వేల కోట్ల ఆస్తుల అమ్మకం!
- జియో కు 248 నోడ్స్ ను అమ్మినట్టు ప్రకటించిన ఆర్‌కామ్
- రూ.2 వేల కోట్ల ఆస్తుల అమ్మకం
- ఇంకా రూ.25 వేల కోట్ల ఆస్తులు అమ్మే యోచన
ప్రముఖ వ్యాపార దిగ్గజమైన రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ అప్పుల ఊబిలో చిక్కుకుపోవటంతో, సంస్థకు చెందిన వైర్‌లెస్ స్పెక్ట్రమ్, టవర్, ఫైబర్ అండ్ ఎంసీఎన్ ఆస్తులను అన్న ముకేష్ నేతృత్వంలోని రిలయన్స్ జియోకు విక్రయించడానికి గత డిసెంబర్లో ఒప్పందం చేసుకున్నారు. ఈ రోజు నోడ్స్ అమ్మకం పూర్తి కాగా, ఇంకా 122.4 మెగా హెడ్జ్ 4జీ స్పెక్ట్రమ్, 43000 టవర్లు, 1,78,000 కిలోమీటర్ల ఫైబర్ అమ్మకాలు ఇంకా ఈ ఒప్పందంలో వున్నాయి.