Chandrababu: ఆంధ్రకేసరికి నివాళి అర్పించిన చంద్రబాబు, జగన్

  • బ్రిటీష్ వారికి ఎదురొడ్డి నిలిచిన ప్రకాశం పంతులు జన్మదినం నేడు
  • తెలుగు రాష్ట్రం కోసం నెహ్రూకే ఎదురు నిలిచిన నేత అన్న చంద్రబాబు
  • ప్రకాశం పంతులు జీవితం ఆదర్శప్రాయమన్న జగన్

బ్రిటీష్ వారికి ఎదురొడ్డి నిలిచి, తెలుగువారిలో సాంతంత్ర్య కాంక్షను రగిల్చిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ లు ఘన నివాళి అర్పించారు. సైమన్ కమిషన్ గోబ్యాక్ అంటూ ప్రకాశం పంతులు గర్జించారని, ప్రాణాలకు తెగించి పోరాడారని చంద్రబాబు అన్నారు.

గాంధీజీ ఇచ్చిన పిలుపుతో ఆంధ్రావనిలో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించారని చెప్పారు. చిన్న వయసులోనే రాజమహేంద్రవరం పురపాలికకు అధ్యక్షుడిగా పని చేశారని, క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో మూడేళ్లు జైలు శిక్షను అనుభవించారని తెలిపారు. తెలుగు మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం ఎందుకివ్వరంటూ, నెహ్రూనే నిలదీశారని చెప్పారు. తుదిశ్వాస వరకు నిస్వార్థంగా పని చేశారని తెలిపారు.

విశాఖపట్నం జిల్లాలో పాదయాత్రను కొనసాగిస్తున్న జగన్... ప్రకాశం పంతులు పోరాటాన్ని, సేవలను స్మరించుకున్నారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ప్రకాశం పంతులు జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు.

  • Loading...

More Telugu News