jagan: పీకే రిపోర్టును చూసి.. టీవీ పగులగొట్టిన జగన్: దేవినేని ఉమామహేశ్వరరావు

  • వైసీపీకి 30 సీట్లు కూడా రావని పీకే రిపోర్టులో ఉంది
  • జగన్ అభద్రతాభావంతో ఉన్నారు
  • స్కూల్ ఎగ్గొట్టిన పిల్లాడిలా రోడ్లపై తిరుగుతున్నారు

వైసీపీ అధినేత జగన్ కు ఆయన సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ (పీకే) సర్వే రిపోర్టును ఇచ్చారని... ఆ రిపోర్టులో వైసీపీకి 30 సీట్లు కూడా రావని ఉందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. రిపోర్టును చూసిన జగన్ తీవ్ర అసహనానికి గురై, ఎదురుగా ఉన్న టీవీని పగులగొట్టారని చెప్పారు. జగన్ కు ముఖ్యమంత్రి పదవి పిచ్చి పట్టిందని విమర్శించారు. జగన్ అభద్రతాభావంతో ఉన్నారని... అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చెప్పారు. కర్నూలులో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ దేవినేని ఉమ పైవ్యాఖ్యలు చేశారు.

సాగునీటి ప్రాజెక్టులపై జగన్ కు అవగాహన లేదని ఉమ తెలిపారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తయితే ఎప్పటికీ సీఎం కాలేననే భయంతో... కేసులు వేయిస్తున్నారని దుయ్యబట్టారు. స్కూల్ ఎగ్గొట్టిన పిల్లాడిలా జగన్ రోడ్లపై తిరుగుతున్నారని... ఆయన కుట్రలు, కుతంత్రాలు టీడీపీని ఏమీ చేయలేవని అన్నారు. 

  • Loading...

More Telugu News