India: పృథ్వీషాకు తీపి కబురు.. ఇంగ్లండ్‌తో చివరి రెండు టెస్టులకు జట్టులో చోటు

  • ఓపెనర్‌గా ఘోరంగా విఫలమైన మురళీ విజయ్
  • రెండో టెస్టులో ఒక్క వికెట్టూ తీయలేకపోయిన కుల్దీప్
  • వారి స్థానాలలో పృథ్వీ షా, హనుమ విహారీ

అండర్-19 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించిన కెప్టెన్ పృథ్వీషాకు బీసీసీఐ తీపి కబురు చెప్పింది. ఇంగ్లండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో మిగిలి వున్న రెండు టెస్టులకు పృథ్వీషాకు చోటు కల్పించింది. అతడితోపాటు 24 ఏళ్ల ఆంధ్రా బ్యాట్స్‌మన్ హనుమ విహారీని కూడా జట్టుకు ఎంపిక చేసింది. వెంటనే బయలుదేరి రావాల్సిందిగా కబురుపెట్టింది.

18 ఏళ్ల పృథ్వీషా ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అద్భుత ఆటతీరుతో భారత్‌కు ప్రపంచకప్ అందించాడు. కాగా, చివరి రెండు టెస్టులకు ఓపెనర్ మురళీ విజయ్, బౌలర్ కుల్దీప్ యాదవ్‌లను జట్టు నుంచి తప్పించారు. మురళీ విజయ్ గత 11 ఇన్నింగ్స్‌లలో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడంతో అతడిపై వేటేశారు. ఇక రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్ ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో వీరిద్దరినీ తప్పించిన మేనేజ్ మెంట్.. వారి స్థానాల్లో పృథ్వీ షా, హనుమ విహారీలను తీసుకుంది.

More Telugu News