Andhra Pradesh: వైసీపీకి మచిలీపట్నం మునిసిపల్ కౌన్సిలర్ రాజీనామా

  • మచిలీపట్నం కౌన్సిలర్ రాజీనామా
  • గత కొంత కాలంగా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌తో విభేదాలు
  • టీడీపీ, జనసేనలో చేరబోనని స్పష్టీకరణ

కృష్ణా జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మచిలీపట్నం పురపాలక సంఘానికి చెందిన కౌన్సిలర్ లక్ష్మీ నాంచారయ్య వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు. గత కొంతకాలంగా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌కు, నాంచారయ్యకు మధ్య పడడం లేదు. ఇటీవల అవి మరింత పెరిగాయి. దీంతో నాంచారయ్య వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం నాంచారయ్య మాట్లాడుతూ తాను టీడీపీ, జనసేనలో చేరనున్నట్టు వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చారు. తాను ఏ పార్టీలోనూ చేరబోవడం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాజకీయాల్లో తటస్థంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.  

  • Loading...

More Telugu News