adityanath: యూపీలో బక్రీద్ వేళ జంతుబలులపై ఆంక్షలు!

  • జంతుబలులు పబ్లిక్ గా చేయొద్దు  
  • మేకలతో సెల్ఫీలు దిగొద్దు .. నాలాల్లో రక్తం కనిపించొద్దు 
  • యోగి నిబంధనలకు ఓకే చెప్పిన ముస్లింలు 

దేశవ్యాప్తంగా ముస్లింలు జంతుబలులిచ్చి బక్రీద్ పండుగను ఉత్సాహంగా జరుపుకుంటుంటే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రం ముస్లింలకు బక్రీద్ పండుగ సందర్భంగా కొన్ని నిబంధనలతో కూడిన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆదేశాలపై ముస్లింలు పాజిటివ్ గా స్పందించారు. నిబంధనలను పాటిస్తామని , ఇతర మతాలవారి సెంటిమెంట్లకు భంగం కలగకుండా చూస్తామని చెప్పారు.

ఇంతకూ యూపీ సీఎం యోగి జారీ చేసిన ఆదేశాలేంటో చూడండి. బక్రీద్ సందర్భంగా ముస్లింలు జంతుబలి ఇవ్వటం సర్వసాధారణం. అయితే బలిచ్చే ముందు ఆ జంతువులతో సెల్ఫీలు దిగటం చాలా కాలంగా జరుగుతోంది. అలా సెల్ఫీలు దిగొద్దని, పబ్లిక్ గా జంతుబలులు చేయొద్దని, నాలాల్లో రక్తం కనిపించొద్దని యోగి ఆదేశాలు జారీ చేశారు.

ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన యోగి ఈ విషయాలను వెల్లడించటంతో పాటు రక్షిత జాబితాలో వుండే జంతువులను ఎట్టి పరిస్థితులలోను బలివ్వకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. బక్రీద్ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా వారికి కావాల్సిన మౌలికవసతుల కల్పన చేయాలని సూచించారు. యూపీలో ప్రస్తుతం కన్వర్ యాత్ర జరుగుతున్న నేపధ్యంలో నిఘా పెంచమని చెప్పిన యోగి బక్రీద్ విషయంలో పెట్టిన నిబంధనలకు ముస్లిం సోదరులు కట్టుబడి ఉంటామని చెప్పటం విశేషం.  

More Telugu News