ntr: ఎన్టీఆర్ కుమార్తెగా కాంగ్రెస్-టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తా: పురందేశ్వరి

  • ‘కాంగ్రెస్’కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ 
  • టీడీపీకి నాడు ద్రోహిలా కనిపించిన ‘కాంగ్రెస్’ 
  • ఈ పొత్తును ఎన్టీఆర్ అభిమానులు కూడా వ్యతిరేకిస్తారు

ఎన్టీఆర్ కుమార్తెగా కాంగ్రెస్-టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తానని బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటుందని, రాష్ట్ర విభజన సమయంలో ద్రోహిలా కనిపించిన కాంగ్రెస్ పార్టీ.. టీడీపీకి ఇప్పుడెలా నచ్చుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు విషయమై ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఎలా స్వాగతిస్తారో చూడాలని అన్నారు. ఈ రెండు పార్టీల పొత్తును ఎన్టీఆర్ అభిమానులు కూడా వ్యతిరేకిస్తారని పురందేశ్వరి అభిప్రాయపడ్డారు.

More Telugu News