chiranjeevi: చిరంజీవికి నారా లోకేష్, విజయ్ దేవరకొండల శుభాకాంక్షలు

  • మరింత ఆరోగ్యంగా, సక్సెస్ ఫుల్ గా ఉండాలి
  • మీ ఆకాంక్షలన్నీ నెరవేరాలన్న నారా లోకేష్
  • మా రోల్ మోడల్ మీరే అన్న విజయ్ దేవరకొండ
మెగాస్టార్ చిరంజీని నేడు 63వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవికి ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ బర్త్ డే చిరంజీవి గారు. రానున్న రోజుల్లో మీరు మరింత ఆరోగ్యంగా, మరింత సక్సెస్ ఫుల్ గా ఉండాలి. మీ ఆకాంక్షలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా' అంటూ ట్వీట్ చేశారు.

వరుస సినిమాలతో దూసుకెళుతున్న హీరో విజయ్ దేవరకొండ కూడా మెగాస్టార్ కు శుభాకాంక్షలు తెలిపాడు. 'మన మెగాస్టార్ కు వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే. మాలాంటి ఎంతో మంది సినీ పరిశ్రమలోకి రావడానికి స్ఫూర్తి మీరే. మా రోల్ మోడల్ మీరే. థాంక్యూ అన్నా' అంటూ ట్వీట్ చేశాడు.
chiranjeevi
vijay devarakonda
nara lokesh

More Telugu News