hyper aadi: హైపర్ ఆది ఈ స్థాయికి వస్తాడని నాకు ముందుగానే తెలుసు: కిరాక్ ఆర్పీ

  • హైపర్ ఆది నాకు ముందునుంచే తెలుసు
  • ఇద్దరం కలిసే తిరిగేవాళ్లం
  • కష్టసుఖాలు చెప్పుకునే వాళ్లం  
'జబర్దస్త్' కామెడీ షో చేసేవారికి 'కిరాక్ ఆర్పీ' పేరును ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఆయనలోని డిఫరెంట్ మేనరిజానికి చాలామంది అభిమానులు వున్నారు. అలాంటి ఆయన తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. "హైపర్ ఆది జీరోగా వున్నప్పటి నుంచి నాకు తెలుసు. హైపర్ ఆది .. నేను ఇద్దరం ఓకే ఇంట్లో ఉండేవాళ్లం. ఎక్కడికి వెళ్లినా ఇద్దరం కలిసే వెళ్లే వాళ్లం.

నా మనసుకి కష్టం కలిగితే తనతో నేను చెప్పుకుంటే .. తాను నాతో చెప్పుకునేవాడు. ఇద్దరం కూడా సింపుల్ గా ఉండటానికే ఇష్టపడుతూ వుంటాము. హైపర్ ఆది ఒక స్థాయికి వెళతాడని నేను ముందుగానే ఊహించాను. అలాగే అతను నా కళ్ల ముందే టీమ్ లీడర్ అయ్యాడు .. సినిమాల్లోకి కూడా వెళ్లాడు. ఒకానొక సమయంలో 'జబర్దస్త్' షోనే ఒక రేంజ్ కి తీసుకెళ్లిన వాడిగా హైపర్ ఆది మార్కులు కొట్టేశాడు" అని చెప్పుకొచ్చాడు.  
hyper aadi
kirak rp

More Telugu News