England: రిషబ్ పంత్‌ను ఔట్ చేసి అసభ్యంగా మాట్లాడిన బ్రాడ్.. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత!

  • పంత్‌ను అసభ్యపదజాలంతో దూషించిన బ్రాడ్
  • ఫిర్యాదు చేసిన రిఫరీ
  • తీవ్రంగా పరిగణించిన ఐసీసీ

ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌పై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడమే కాకుండా డీమెరిట్ పాయింట్స్ కలిపింది. భారత్-ఇంగ్లండ్ మధ్య నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జి స్టేడియంలో మూడో టెస్టు జరుగుతోంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో కీపర్ రిషబ్ పంత్‌ను స్టువర్ట్ బ్రాడ్ బౌల్డ్ చేశాడు. మైదానం వీడుతున్న పంత్‌ను చూస్తూ పేసర్ బ్రాడ్ అసభ్యంగా మాట్లాడాడు. దీనిని గమనించిన మ్యాచ్ రిఫరీ బ్రాడ్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. బ్రాడ్ చర్యను తీవ్రంగా పరిగణించిన ఐసీసీ అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోతం విధించడమే కాకుండా డీమెరిట్ పాయింట్లు కలిపింది.

కాగా, తొలి రెండు టెస్టుల్లో ఓడిపోయి ఐదు టెస్టుల సిరీస్‌లో 0-2తో వెనకబడిన భారత్.. మూడో టెస్టులో పట్టుబిగించింది. భారత్ విజయానికి మరొక్క వికెట్ మాత్రమే అవసరం కాగా, రోజంతా సమయం ఉంది. దీంతో భారత్ గెలుపు ఖాయమైంది.

More Telugu News