syeraa: టీజర్ అదిరిపోయింది... అంటూ బాబాయ్ రిప్లై ఇచ్చారు!: రామ్ చరణ్

  • టీజర్ ను చూసిన తొలి వ్యక్తి పవన్ అని చెప్పిన చరణ్
  • ఔట్ పుట్ రాగానే బాబాయ్ కి ఫార్వర్డ్ చేశా
  • అదిరిపోయింది.. సినిమా చూసేందుకు రెడీ అవుతున్నా అని బాబాయ్ చెప్పారు
మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తాజా చిత్రం 'సైరా' టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అద్భుతమైన విజువల్, సౌండ్ ఎఫెక్ట్స్ తో ఉన్న ఈ టీజర్ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. టీజరే ఈ రేంజ్ లో ఉంటే... సినిమా ఇంకెంత రేంజ్ లో ఉంటుందో అనే అంచనాలు పెరిగిపోయాయి.

ఈ టీజర్ కు సంబంధించి ఈ సినిమాను నిర్మిస్తున్న చిరు తనయుడు రామ్ చరణ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. 'సైరా' టీజర్ ను చూసిన మొదటి వ్యక్తి పవన్ కల్యాణ్ అని తెలిపాడు. టీజర్ ను విడుదల చేసే రోజు ఫైనల్ ఔట్ పుట్ తనకు ఉదయం 10.45 గంటలకు వచ్చిందని, వెంటనే దాన్ని తాను బాబాయ్ కి ఫార్వర్డ్ చేశానని చెప్పాడు. ఆ తర్వాత 11.10 గంటలకు బాబాయ్ నుంచి తనకు రిప్లయ్ వచ్చిందని... 'టీజర్ అదిరిపోయింది... థియేటర్ లో చూసేందుకు రెడీ అవుతున్నాను' అని బాబాయ్ చెప్పారని చరణ్ తెలిపాడు.
syeraa
teaser
Ramcharan
Chiranjeevi
Pawan Kalyan
tollywood
janasena

More Telugu News