Banjarahills: దొంగను పట్టాలని పోలీసులను ఆశ్రయించిన సినీ ఫైటర్లు!

  • బంజారాహిల్స్ లో దొంగతనం
  • కారులోని నగదు, మ్యూజిక్ ప్లేయర్ చోరీ
  • బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు
వెండితెరపై వాళ్లను చూస్తే దడ పుడుతుంది. చూస్తేనే భయపెట్టేలా కనిపిస్తూ, గాల్లో గింగిరాలు తిరుగుతూ వారు పోరాటాలు చేస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అటువంటి వాళ్లను హడలెత్తించాడో దొంగ. అతనిని ఎలాగైనా పట్టుకోవాలని కోరుతూ, టాలీవుడ్ ఫైటర్లు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.

కమలాపురి కాలనీకి చెందిన రాజేందర్ అనే ఫైట్ మాస్టర్, తన కారును ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. తెల్లారేసరికి కారు అద్దాలు పగిలివుండగా, కారులో ఉంచిన రూ. 20 వేల నగదు, మ్యూజిక్ ప్లేయర్ కనిపించలేదు. దీంతో తన అనుచరులతో కలసి పోలీసు స్టేషన్ కు వచ్చిన రాజేందర్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీ టీవీ ఫుటేజ్ ల ఆధారంగా దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. 
Banjarahills
Hyderabad
Tollywood
Fighter
Police

More Telugu News