paruchuri: ప్రసాదం ఇస్తే పరిటాల రవి అలా అన్నారు .. ఆ సీన్ 'సమరసింహా రెడ్డి'లో పెట్టాను!: పరుచూరి గోపాలకృష్ణ

షార్ట్స్‌లో చూడండి
అనూహ్యమైన మలుపులతో ఆసక్తికరంగా కథను తయారుచేయడంలో పరుచూరి బ్రదర్స్ సిద్ధహస్తులు. అలాంటి పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడుతూ, 'శ్రీరాములయ్య' సినిమాను గురించి ప్రస్తావించారు. 'శ్రీరాములయ్య' సినిమా సిటింగ్స్ జరుగుతూ ఉండగా, ప్రసాదంగా నేను ఒక లడ్డూను పరిటాల రవికి ఇచ్చాను. ఆయన తినబోతూ ఒక నిమిషం ఆగారు .. 'ఎవరిచ్చారు అన్నా ఇది?' అన్నారు.

 'మా రెండో అన్నయ్య పంపించారు' అని నేను చెబితే అప్పుడు ఆయన తిన్నారు. 'ఎందుకలా అనుమానించారు?' అని అడిగాను. 'అది కాదన్నా, నువ్ ఇచ్చింది ఏదైనా నేను తింటాననుకుని నీ చేతి ద్వారా అది నాకు అందేలా శత్రువులు ఏర్పాటు చేసే ఛాన్స్ వుంది .. అందుకని' అన్నారు. శత్రువు ఎన్ని రకాలుగా రాగలడు? అనే ఈ అంశం నాకు నచ్చి 'సమరసింహా రెడ్డి' సినిమాలో పెట్టాను. బాలయ్య బాబు కంటే ముందుగా పృథ్వీ తిని చూసి ఆ తరువాత ఆయనకి ఇస్తాడు' అని చెప్పుకొచ్చారు.     
Go Back to Shorts
paruchuri
paritaala

More Telugu News