nayanatara: తెలుగులో నయనతార మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

  • తమిళంలో 'కొలమావు కోకిల'
  • తెలుగులో 'కోకో కోకిల'
  • ఈ నెల 31వ తేదీన విడుదల

తమిళంలో ఈ నెల 17వ తేదీన 'కొలమావు కోకిల' సినిమా విడుదలైంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార ప్రధానమైన పాత్రను పోషించింది. పరిస్థితుల కారణంగా డ్రగ్స్ సప్లై చేసే యువతిగా ఈ సినిమాలో నయనతార కనిపిస్తుంది. తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, 3 రోజుల్లోనే 10 కోట్లను వసూలు చేసింది. నయనతార కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఈ సినిమాకి కూడా చోటు దక్కింది.

దాంతో తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'కోకోకోకిల' పేరుతో ఈ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నట్టు దర్శకనిర్మాతలు ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు. గతంలో నయనతార ప్రధాన పాత్రగా తెలుగులోకి వచ్చిన 'మయూరి' .. 'డోరా' ఇక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా కూడా ఇక్కడ సక్సెస్ ను సాధిస్తుందేమో చూడాలి.            

More Telugu News