కేరళ విలయంపై తాజా గణాంకాలు ఇవీ.. వెల్లడించిన ముఖ్యమంత్రి
- 370 మంది ప్రాణాలు తీసిన వరదలు
- నిరాశ్రయులుగా మారిన పది లక్షల మంది
- రూ.20 వేల కోట్ల నష్టం
సోమవారం 602 మందిని రక్షించినట్టు సీఎం తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో కేరళ వార్షిక వ్యయం రూ.37,248 కోట్లని, ఇప్పుడు వరదల కారణంగా సంభవించిన నష్టం ఐదేళ్ల ప్రణాళిక వ్యయం కంటే ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి ఇప్పటి వరకు రూ.210 కోట్లు వచ్చాయని, మరో 160 కోట్లు రానున్నాయని తెలిపారు. కాగా, వరదల కారణంగా రూ.20 వేల కోట్ల నష్టం వాటిలినట్టు అంచనా వేస్తున్నారు.