Asaduddin Owaisi: యూపీ డిప్యూటీ సీఎంపై ఒవైసీ ఫైర్

  • అయోధ్య రామాలయం అంశం సుప్రీంకోర్టులో ఉంది
  • దాని గురించి బాధ్యతాయుత స్థానంలో ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడతారు?
  • ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది

రాజ్యసభలో బీజేపీకి కావాల్సినంత బలం ఉన్నరోజున అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చట్టాన్ని తీసుకొస్తామంటూ ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. అయోధ్య అంశం సుప్రీంకోర్టులో ఉండగా... బాధ్యత కలిగిన ఓ ఉప ముఖ్యమంత్రి దానిపై ఎలా వ్యాఖ్యానిస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని చెప్పారు. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న అంశంపై మాట్లాడే హక్కు ఆయనకు ఎక్కడిదని ప్రశ్నించారు.

కేశవ్ ప్రసాద్ వ్యాఖ్యలపై ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరే కూడా మండిపడ్డారు. బీజేపీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే... రామాలయం సమస్యను లేవనెత్తుతోందని ఆయన విమర్శించారు. ఆలయ నిర్మాణాన్ని ఎన్నికల అంశంగా వాడుకోవడం సరికాదని అన్నారు. అభివృద్ధి పనుల పేరుతో బీజేపీ చేస్తున్నదేమీ లేదని దుయ్యబట్టారు. 

More Telugu News