నా మొహమాటమే నా కొంపముంచేసింది: 'గీత గోవిందం' దర్శకుడు
- 'ఆంజనేయులు'సమయంలో పొరపాట్లు జరిగాయి
- 'సోలో' సినిమాకి కొన్ని విషయాలు తెలుసుకున్నాను
- నా చుట్టూ వుండి పొగిడినవాళ్లు దూరంగా వెళ్లిపోయారు
'సోలో' సినిమా చేసే సమయానికి కొన్ని విషయాలను తెలుసుకున్నాను. ఆ తరువాత నా డ్రీమ్ ప్రాజెక్టుగా 'సారొచ్చారు' చేశాను. కొంతమంది కారణంగా కథలో మార్పులు చేయడం వలన అనుకున్న విధంగా చేయలేకపోయాను. కరెక్టుగా చెప్పాలంటే మొహమాటానికి పోయాను .. ఆ మొహమాటమే నా కొంపముంచింది. అప్పటి వరకూ నా చుట్టూ వుండి 'నువ్ సూపర్ రా' అంటూ పొగిడిన వాళ్లంతా నా మనసు గాయపరిచి మరీ దూరంగా వెళ్లిపోయారు. ఆ సమయంలో నాకు అండగా నిలబడింది నా భార్య మాత్రమే" అని చెప్పుకొచ్చారు.