santhosh sobhan: వారం ముందుగానే 'పేపర్ బాయ్' వచ్చే ఛాన్స్

  • సంపత్ నంది నిర్మాతగా 'పేపర్ బాయ్'
  • టీజర్ .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ 
  • విడుదల తేదీ మారే ఛాన్స్

దర్శకుడిగా తనకంటూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సంపత్ నంది, నిర్మాతగా మారిపోయి 'పేపర్ బాయ్' సినిమాను నిర్మించాడు. జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాయకా నాయికలుగా సంతోష్ శోభన్ .. రియా సుమన్ నటించారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ కి .. టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

వచ్చేనెల 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ నెల 31వ తేదీన విడుదల కావలసిన 'శైలజా రెడ్డి అల్లుడు' వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడితే, 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'పేపర్ బాయ్' రెడీ అవుతున్నట్టుగా సమాచారం. సెప్టెంబర్ 7వ తేదీన విడుదలయ్యే సినిమాల సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా, 'పేపర్ బాయ్' ముందుకు రావాలనుకోవడానికి మరో కారణమని చెబుతున్నారు.              

  • Loading...

More Telugu News