rape: బైక్ చెడిపోవడంతో స్నేహితుడికి యువతి ఫోన్.. సాయం కోసం వచ్చి గ్యాంగ్ రేప్ చేసిన 11 మంది!

  • జార్ఖండ్ లోని లోహర్దగా జిల్లాలో దారుణం
  • సాయం కోసం 11 మందిని పంపిన స్నేహితుడు
  • యువతులపై లైంగికదాడికి పాల్పడ్డ నీచులు

ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. మధ్యలో బైక్ ఆగిపోవడంతో సాయం చేయాలని ఓ అమ్మాయిు స్నేహితుడికి ఫోన్ చేయగా, అతను ఘటనాస్థలికి 11 మందిని పంపాడు. వీరు సాయం చేయకుండా అక్కడ ఉన్న ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జార్ఖండ్ లోని లోహర్దగా జిల్లాలో ఆగస్టు 16 న జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జార్ఖండ్ లోని హిర్హీ హర్ర ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్ యువతులు తమ పొరుగింటి వ్యక్తితో కలసి గ్రామానికి తిరిగివస్తున్నారు. ఇంతలో మార్గమధ్యంలో బైక్ ఆగిపోయింది. దీంతో ఇద్దరు యువతుల్లో ఒకరు తమ పరిస్థితిని తెలియజేస్తూ ఓ స్నేహితుడికి ఫోన్ చేశారు. దీంతో సదరు వ్యక్తి  వెంటనే ఘటనాస్థలికి 11 మంది తన స్నేహితులను పంపాడు.

తొలుత పొరుగింటి వ్యక్తిపై దాడిచేసిన ఈ దుండగులు అతడిని తరిమేశారు. అనంతరం యువతులను నిర్మానుష్య ప్రదేశంలోకి బలవంతంగా తీసుకెళ్లారు. ఒకరితర్వాత మరొకరు ఇద్దరు యువతులపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి ఈ విషయం బయటకు చెప్పకుండా ఉండాలని హెచ్చరించి మొబైల్ ఫోన్లు లాక్కుని అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ ఘటనపై ఇద్దరు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన జార్ఖండ్ పోలీసులు.. 11 మందిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

More Telugu News