lavanya tripathi: బ్యాడ్ లక్ .. హిట్ సినిమాలు వదిలేస్తోన్న లావణ్యత్రిపాఠి

  • 'తొలిప్రేమ'ను వదులుకున్న లావణ్య
  • 'గీత గోవిందం'కు కూడా నో చెప్పేసింది 
  • రెండూ భారీ విజయాలను సాధించాయి  

నాజూకు సుందరి లావణ్య త్రిపాఠికి యూత్ లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో హిట్లు లేకపోవడం వలన, కాస్త వెనకబడిపోయిందనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె రెండు భారీ విజయాలను వదులుకోవడం దురదృష్టంగానే ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

 'గీత గోవిందం' సినిమాలో ముందుగా లావణ్య త్రిపాఠిని తీసుకోవాలని అనుకున్నారట. ఫోటో షూట్ ను కూడా చేశామనీ .. అయితే చివరి నిమిషంలో ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుందని పరశురామ్ చెప్పారు. అప్పటికే అంగీకరించిన ఒక తమిళ సినిమా వలన లావణ్య ఈ సినిమా చేయలేకపోయిందని అన్నారు.

ఆ తరువాతనే తాము రష్మిక మందనను సంప్రదించామని చెప్పారు. ఇక వరుణ్ తేజ్ జోడీగా 'తొలిప్రేమ'లో చేసే ఛాన్స్ కూడా ముందుగా లావణ్యకే వచ్చిందట. కొన్ని కారణాల వలన ఆమె చేయలేకపోవడం వలన అది రాశి ఖన్నాకు వెళ్లింది. ఇలా రెండు భారీ హిట్లను లావణ్య వదులుకోవడం నిజంగా బ్యాడ్ లక్కే.   

  • Loading...

More Telugu News