Snake: కృష్ణా జిల్లాలో పెరుగుతున్న పాము కాటు బాధితులు... ఆసుపత్రులకు పరుగులు!

  • అంతకంతకూ పెరుగుతున్న బాధితులు
  • నేడు మరో ఎనిమిది మందిని కరిచిన పాములు
  • వరదల్లో దిక్కుతోచని స్థితిలో కొట్టుకు వస్తున్న సర్పాలు

కృష్ణా జిల్లాలోని దివిసీమలో పాముకాటు బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దివిసీమను వరదలు చుట్టుముట్టగా, ఎక్కడెక్కడి నుంచో కొట్టుకు వస్తున్న తాచుపాములు పలువుర్ని కాటేస్తుండగా, వారంతా ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు.

వరద నీటిలో కొట్టుకువస్తున్న పాములు దిక్కుతోచని స్థితిలో దివిసీమ ప్రాంతంలోని చెట్లను తగిలి, వరద నీటి నుంచి బయటకు వస్తున్నాయని, అప్పటికే అయోమయ స్థితిలో ఉన్న అవి, తమకు తగిలిన వారిని కాటేస్తున్నాయని అధికారులు అంటున్నారు. నిన్న ఒక్కరోజులోనే 24 మంది పాముకాటుకు గురికాగా, నేడు మరో 8 మందిని పాములు కాటేశాయి. వీరందరినీ అవనిగడ్డ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. వీరిలో 26 మందికి ప్రాణాపాయం తప్పినట్టేనని, మిగతా వారిని అబ్జర్వేషన్ లో ఉంచామని వైద్యులు వెల్లడించారు.

More Telugu News