జగన్‌కు బోల్డంత డబ్బు డొనేషన్ ఇచ్చా.. ఇక్కడ ఎలా గెలవాలో నాకు తెలుసు: కన్నబాబు రాజు
- విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న జగన్
- నియోజక వర్గాల వారీగా విజయసాయి సమావేశాలు
- ఎవరెన్ని చెప్పినా తన స్టైల్ మారదన్న కన్నబాబు
ప్రస్తుతం వైసీపీ చీఫ్ జగన్ విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ, జగన్ పాదయాత్రపై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం యలమంచిలి నేతలు, కార్యకర్తలతో మునగపాకలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ మాజీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ కన్నబాబుపై పలు ఆరోపణలు చేశారు. దీంతో, ఆ తర్వాత మైకందుకున్న కన్నబాబు మాట్లాడుతూ జగన్‌కు తాను బోల్డంత విరాళం ఇచ్చానని, తనను ఎవరూ అడ్డుకోలేరని చెప్పడంతో కలకలం రేగింది. ఇరు వర్గాల మద్దతుదారులు నినాదాలు చేసుకున్నారు.