varun dhawan: తండ్రికి అరుదైన బహుమతిని ఇచ్చిన బాలీవుడ్ హీరో డేవిడ్ ధావన్

  • తండ్రి డేవిడ్ ధావన్ పుట్టినరోజు నేడు
  • సొంతంగా చొక్కా కుట్టి తండ్రికి బహూకరించిన వరుణ్
  • కుమారుడిని ఆప్యాయంగా హత్తుకున్న తండ్రి
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తన తండ్రికి అరుదైన బహుమతిని ఇచ్చాడు. ఆయన తండ్రి డైరెక్టర్ డేవిడ్ ధావన్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తాను స్వయంగా కుట్టిన చొక్కాను తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు వరుణ్. టైలర్లు కుట్టేంత మంచిగా తాను దుస్తులను కుట్టలేనని... అయితే, 'సూయి ధాగా' సినిమా కోసం తాను టైలరింగ్ నేర్చుకున్నానని ఈ సందర్భంగా వరుణ్ తెలిపాడు. తన కుమారుడు ఇచ్చిన అద్భుతమైన బహుమతిని అందుకున్న డేవిడ్ ధావన్... వరుణ్ ను ప్రేమతో హత్తుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
varun dhawan
david dhawan
gift
bollywood
suidhaaga

More Telugu News