కేరళ నష్టం 2 లక్షల కోట్ల రూపాయలు!

  • లక్ష కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసం
  • దెబ్బతిన్న 134 వంతెనలు
  • 4 లక్షల మంది నిరాశ్రయులు
ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళ కోలుకోలేనంతగా దెబ్బతింది. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టం రూ. 2 లక్షల కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో లక్ష కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. 16 వేల కిలోమీటర్ల మేర పీడబ్ల్యూడీ రోడ్లు, 82 వేల కిలోమీటర్ల మేర లోకల్ రోడ్లు దెబ్బతిన్నాయి. 134 వంతెనలు ధ్వంసమయ్యాయి. రోడ్లు, వంతెనల నష్టమే రూ. 13,800 కోట్లుగా ఉంటుందని చెబుతున్నారు. 40 వేల హెక్టార్లలో పంటనష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు 400 మంది ప్రాణాలు కోల్పోగా, 4 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మధ్య కేరళలోని త్రిస్సూర్, అలువా, ఇడుక్కి ప్రాంతాలు భారీగా దెబ్బతిన్నాయి.
Go Back to Shorts
kerala
floods
loss

More Telugu News