Ranga Reddy District: గుడిలో ఏకంగా లింగాన్నే మాయం చేశారు!

  • రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఘటన
  • కేతిరెడ్డిపల్లి సమీపంలో ఉన్న ఆలయంలో శివలింగం మాయం
  • కేసు నమోదు చేసిన పోలీసులు
'గుడిలో లింగాన్ని కూడా మింగేస్తారు' అనే సామెతను మనం తరచుగా ఉపయోగిస్తూనే ఉంటాం. తాజాగా ఇక్కడ అదే జరిగింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామం సమీపంలో పురాతనమైన వీరాంజనేయస్వామి దేవాలయం ఉంది. పండగల సమయంల్లో మాత్రమే ఈ ఆలయానికి భక్తులు వెళ్తుంటారు.

తాజాగా ఆలయానికి వెళ్లిన భక్తులకు గుడిలోని శివలింగం కనిపించలేదు. వార్త తెలిసిన వెంటనే గుంపులు గుంపులుగా గ్రామస్తులు ఆలయానికి చేరుకున్నారు. ఈ లింగాన్ని నిన్న రాత్రి తీసుకెళ్లారా? లేక రెండుమూడు రోజుల క్రితమే తీసుకెళ్లారా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ ఆలయ సంరక్షణ కోసం పురావస్తు శాఖ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
Ranga Reddy District
moinabad mandal
kethireddypalli
sivalingam
theft

More Telugu News