vijay devarakonda: బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ!

  • బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన విజయ్ దేవరకొండ
  • ప్రోమోను విడుదల చేసిన స్టార్ మా
  • ఈ రాత్రి 9 గంటలకు కనువిందు చేయనున్న రియాల్టీ షో
బిగ్ బాస్ సీజన్-2 ప్రేక్షకులను ఎంతగానో అకట్టుకున్న సంగతి తెలిసిందే. షో మధ్యలో సెలబ్రిటీలు కూడా వచ్చి బిగ్ బాస్ హౌస్ కు మరింత గ్లామర్ తీసుకొస్తున్నారు. ఇప్పటికే విలక్షణ నటుడు కమలహాసన్, మంచు లక్ష్మి తదితరులు హౌస్ లో సందడి చేశారు. తాజాగా 'అర్జున్ రెడ్డి' విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టాడు. దీనికి సంబంధించిన ఒక ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో విజయ్ ఎంత సందడి చేశాడో మనం చూడొచ్చు. విజయ్ నటించిన 'గీతగోవిందం' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే.
vijay devarakonda
bigboss

More Telugu News