Biggvoss: కొనసాగుతున్న లీకుల పరంపర... నేడు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కానున్న దీప్తి సునయన!

  • తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బిగ్ బాస్
  • నేడు హౌస్ నుంచి దీప్తి సునయన బయటకు
  • పూజ, రోల్ రైడాలు సేఫ్ జోన్ లోనేనని లీకులు
బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ రెండో సీజన్ లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరన్న విషయంలో నెట్టింట సమాధానం దొరికింది. ప్రతి వారమూ ముందుగా లీక్ అవుతున్నట్టుగానే, ఈ వారంలో దీప్తి సునయన పేరు బయటకు వచ్చింది. దీప్తి ఎలిమినేట్ అయిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. దీప్తితో పాటు పూజ, రోల్ రైడాలు ఎలిమినేషన్ ను ఎదుర్కొంటుండగా, ఎవరు బయటకు వెళ్లాలన్న విషయమై, నేటి రాత్రి ఎపిసోడ్ లో హోస్ట్ నాని ప్రకటన చేయనున్నాడు. కాగా, గత కొన్ని రోజులుగా హౌస్ లో యాక్టివ్ గా లేకపోవడం, కౌశల్ తో మాట్లాడిన తీరు, టాస్క్ లలో విఫలం కావడం దీప్తికి నెగటివ్ గా మారినట్టు తెలుస్తోంది. దీప్తి ఎలిమినేషన్ పై ఈ సస్పెన్స్ తొలగాలంటే రాత్రి వరకూ వేచి చూడాల్సిందే.
Biggvoss
Season 2
Pooja
Deepti Sunayana
Roll Raida

More Telugu News