manik reddy: టీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి మృతి

  • అనారోగ్యంతో బాధపడుతున్న నేత
  • కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • స్వగ్రామం డాకూర్ లో ఈ రోజు అంత్యక్రియలు
తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) సీనియర్ నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు మాణిక్ రెడ్డి ఈ రోజు ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో చేర్చారు. ఆదివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. కాగా, మాణిక్ రెడ్డి స్వగ్రామమైన మెదక్ జిల్లాలోని ఆందోల్ మండలం డాకూర్ లో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాణిక్ రెడ్డి మృతితో మెదక్ జిల్లా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు.
manik reddy
TRS
dead
Hyderabad
care hospital

More Telugu News