Tirumala: ఏం కష్టమొచ్చిందో... తిరుమల వెంకన్న సన్నిధిలో బిడ్డను వదిలి వెళ్లిన తల్లిదండ్రులు!

  • కల్యాణకట్ట వద్ద పాపను వదిలెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
  • అశ్విని ఆసుపత్రికి తరలించిన విజిలెన్స్ సిబ్బంది
  • సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామన్న అధికారులు
బిడ్డకు గుక్కెడు పాలు కూడా పట్టలేనన్ని ఆర్థిక కష్టాలో లేక, పుట్టిన ఆడపిల్ల భారంగా మారుతుందన్న భావనోగానీ, ఏడు రోజుల వయసున్న పసికందును తిరుమలలో వదిలి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. శ్రీవారి ఆలయం ముందున్న కల్యాణకట్ట వద్ద ఈ ఘటన జరిగింది. చక్కగా ఉన్న ఓ పాప ఏడుస్తూ ఉంటే, చూసిన ఇతర భక్తులు, పాపను వదిలి వెళ్లేందుకు మనసెలా వచ్చిందోనని తిడుతూనే, విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు పాపను అశ్విని ఆసుపత్రికి తరలించారు. పాప చాలా ఆరోగ్యంగా ఉందని అధికారులు తెలిపారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, శిశువును ఎవరు వదిలి వెళ్లారన్న విషయాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని భద్రతా సిబ్బంది వెల్లడించారు.
Tirumala
Tirupati
TTD
Baby

More Telugu News