Atal Bihari Vajpayee: వాజ్‌పేయి ఆ విషయం చెప్పగానే భయపడ్డా: యశ్వంత్ సిన్హా
- అణుపరీక్షల విషయం చెప్పడంతో నిర్ఘాంతపోయా
- అగ్రరాజ్యాల ఆంక్షల గురించి ఆలోచించా
- అయినా మనసులోనే దాచుకున్నాను
మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి కన్నుమూసి అప్పుడే మూడు రోజులు అయిపోయింది. దేశ రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేసి వెళ్లిపోయారు. ఆయనతో కలిసి పనిచేసిన వారు, ఆయనను దగ్గరుండి చూసిన వారు ఆయనతో తమకున్న అనుబంధాన్ని, అనుభూతులను, జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.
తాజాగా, వాజ్‌పేయి హయాంలో మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా మరో కొత్త విషయాన్ని బయటపెట్టారు. మే 1998లో వాజ్‌పేయి తనను పిలిచి అణుపరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పడంతో ఒక్కసారిగా షాకయ్యానని పేర్కొన్నారు. అణుపరీక్షలు కనుక నిర్వహిస్తే అగ్రదేశాలు విధించే ఆంక్షలను తట్టుకోగలమా? అన్న భయం వేసిందని, అయినప్పటికీ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని సిన్హా గుర్తు చేసుకున్నారు. ఆయన ఊహించినట్టే అయింది. ఫోఖ్రాన్‌లో నిర్వహించిన అణుపరీక్షలపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌పై ఆంక్షలు విధించింది.