jayalalitha: జయలలిత మరణం కేసు.. వైద్యులకు సమన్లు జారీచేసిన ఆర్ముగస్వామి కమిషన్!

  • ఈ నెల 23, 24న విచారణకు హాజరుకావాలని సమన్లు
  • అంగీకరించిన ఎయిమ్స్ వైద్యులు
  • జయ మృతిపై అనుమానాల నేపథ్యంలో ఏర్పాటు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత 2016, డిసెంబర్ 5న అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చిన ఎయిమ్స్ వైద్యులు ఆమెకు అందుతున్న చికిత్సను పరిశీలించారు. ఈ నేపథ్యంలో చెన్నైకి వచ్చిన ముగ్గురు వైద్యులకు సమన్లు జారీ అయ్యాయి.


జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్.. తాజాగా ముగ్గురు వైద్యులకు సమన్లు జారీచేసింది. ఈ నెల 23, 24 తేదీల్లో తమముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కమిషన్ సమన్లు అందుకున్న వైద్యులు విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో జయలలితకు అందిన చికిత్సపై అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జయలలిత నెచ్చెలి శశికళ.. పార్టీ నేతలు సహా ఎవ్వరినీ జయతో కలవనివ్వలేదు. ఈ నేపథ్యంలో పలు వదంతులు రావడంతో తమిళనాడు ప్రభుత్వం మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి నేతృత్వంలో  ఏకసభ్య కమిషన్ ను నియమించింది.

More Telugu News