parashuram: 'గీత గోవిందం' దర్శకుడితో మెగాహీరో

  • హిట్ టాక్ తెచ్చుకున్న 'గీత గోవిందం'
  • దర్శకుడిగా పరశురామ్ కి క్రేజ్ 
  • త్వరలోనే పట్టాలెక్కనున్న ప్రాజెక్టు   
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గీత గోవిందం' తెలుగు రాష్ట్రాల్లో విజయవిహారం చేస్తోంది. ఇక ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. స్టార్ హోదాకి చాలా దగ్గరగా ఆయనను ఈ సినిమా తీసుకెళ్లిందని అంటున్నారు. ఈ సినిమాకి ఈ స్థాయి విజయాన్ని తీసుకొచ్చిన దర్శకుడు పరశురామ్ తో చేయడానికి చాలామంది నిర్మాతలు .. హీరోలు ఉత్సాహాన్ని చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో ముందుగా జరిగిన చర్చల ప్రకారం మంచు విష్ణుతో పరశురామ్ తన నెక్స్ట్ మూవీ చేయాల్సివుంది. కానీ ఆయన మళ్లీ గీతా ఆర్ట్స్ లోనే చేయనున్నట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా గీతా ఆర్ట్స్ లో చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ సినిమాలు రెండు .. సెట్స్ పై వున్నాయి. అవి పూర్తికాగానే పరశురామ్ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.    
parashuram
varun thej

More Telugu News