Robert Vadra: దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు!: రాబర్ట్ వాద్రా

  • తిరుమలలో రాబర్ట్ వాద్రా 
  • మార్పు కాంగ్రెస్ తోనే సాధ్యం  
  • దేశరాజకీయాల్లో త్వరలో భారీ మార్పులు 
దేశ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అయితే ఆ మార్పు తీసుకురావటం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో త్వరలో భారీ మార్పులు జరగనున్నాయని ఆయన జోస్యం చెప్పారు. ఈ రోజు తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ రాహుల్ గాంధి చాలా కష్టపడుతున్నారని పేర్కొనారు. రాహుల్ కు అండగా తమ కుటుంబం ఉంటుందని, తన పూర్తి మద్దతు రాహుల్ కేనని తెలిపారు.
Robert Vadra

More Telugu News