vijay devarakonda: ఆశ్చర్యపరుస్తోన్న 'గీత గోవిందం' 3 రోజుల వసూళ్లు

  • నైజామ్ లో 10.04 కోట్ల గ్రాస్ 
  • ఓవర్సీస్ లో 5.65 కోట్ల గ్రాస్ 
  • ప్రపంచవ్యాప్తంగా 37.45 కోట్ల గ్రాస్

ఇప్పుడు ఎక్కడ చూసినా యూత్ అంతా కూడా 'గీత గోవిందం' సినిమాను గురించే మాట్లాడుకుంటోంది. అంతగా ఈ ప్రేమకథ అందరి మనసులను దోచుకుంది. కథాకథనాలు .. పాటలు ప్రేక్షకులను పదే పదే థియేటర్స్ కి రప్పిస్తున్నాయి. భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా విజయ శంఖం పూరించింది. ఈ సినిమా మూడు రోజుల్లోనే భారీ వసూళ్లను రాబట్టేసింది.

ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో ఈ సినిమా 37.45 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి ఆశ్చర్యచకితులను చేసింది. ఒక్క నైజామ్ ఏరియాలోనే ఈ సినిమా 10.04 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం విశేషం. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే అక్కడ ఈ 3 రోజుల్లో 5.65 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. అంచనాలకి తగినట్టుగానే ఈ వీకెండ్ పూర్తయ్యేనాటికి ఈ  సినిమా 50 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News