jagapathibabu: నాకు జీవితంలో నటించడం రాదు: జగపతిబాబు

  • అనుభవాలు పాఠాలు నేర్పుతాయి 
  • నేను అందరిలో ఇమడలేను 
  • రాజకీయాలు నాకు సూట్ కావు
యాక్షన్ హీరోగానూ, ఫ్యామిలీ హీరోగాను మంచి క్రేజ్ తెచ్చుకున్న జగపతిబాబు, ప్రస్తుతం విలన్ గాను, కేరక్టర్ ఆర్టిస్ట్ గాను బిజీగా వున్నారు. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ ఆడియన్స్ ను మెప్పిస్తున్నారు. అలాంటి జగపతిబాబు తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు.

"అనుభవాలు నాకు ఎన్నో పాఠాలు నేర్పాయి .. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు కంగారుపడకూడదు .. ఆత్మహత్య వంటి ఆలోచనలు చేయకూడదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ వుంటుంది .. అది నిరూపించుకునే సమయం వచ్చేవరకూ వెయిట్ చేయాలి. నా దగ్గర కొంతమంది రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ వుంటారు. రాజకీయాలు అంటే చాలామందిని కలవాల్సి వుంటుంది .. నేను అందరిలో కలవలేను. మాటలు కలపడాలు .. నటించడాలు నాకు చేతకాదు. అందుకే రాజకీయాలు నాకు ఎంతమాత్రం సూట్ కావు" అని చెప్పుకొచ్చారు.      
jagapathibabu

More Telugu News