'గీత గోవిందం'లో తప్పకుండా చేయాలనుకున్నాను .. నాన్నను ఒప్పించాను: రష్మిక మందన

- గీత పాత్ర నాకు బాగా నచ్చింది
- నా పాత్రకి ప్రశంసలు దక్కుతున్నాయి
- నా నిర్ణయం సరైనదే
సాధారణంగా నా దగ్గరికి ఏదైనా పాత్ర వచ్చినప్పుడు మా పేరెంట్స్ సలహాలతో పాటు, నా స్నేహితుల అభిప్రాయాలను కూడా తీసుకుంటాను. ఒక్కోసారి ఈ పాత్రను చేయాల్సిందే అని నేను అనుకున్నప్పుడు ఆ విషయంలో మా నాన్నను ఒప్పిస్తాను. అలా 'గీత గోవిందం' సినిమాలో 'గీత' పాత్ర కోసం నేను మా నాన్నను ఒప్పించాను. ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోవడం .. నా పాత్రకి ప్రశంసలు లభిస్తుండటం చూస్తుంటే, నా నిర్ణయం సరైనదేనని అనిపించింది" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.