Serena Williams: ఆ హంతకుడి వల్లే టోర్నీ ఓడిపోయా!: సెరెనా విలియమ్స్

  • సోదరిని చంపినవాడు పెరోల్ పై బయటకు రావటమే ఓటమికి కారణం
  • ఆ భయంతోనే సిలికాన్ వ్యాలీ క్లాసిక్ టోర్నీలో ఘోర పరాజయం
  • సోదరి హత్య ఘటన, సోదరి పిల్లల గురించి బాధ మరువలేను

23 గ్రాండ్‌ స్లామ్‌ల విజేత, అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరీనా విలియమ్స్‌ సిలికాన్‌ వ్యాలీ క్లాసిక్‌ టోర్నీలో ఘోర పరాజయం పాలైంది. దానికి కారణం, తన సోదరిని చంపిన హంతకుడు పెరోల్ పై విడుదల అయినట్టు మ్యాచ్ కు 10 నిముషాల ముందు ఇన్ స్టాగ్రామ్ లో సెరీనా మెసేజ్ చూసింది. దాంతో భయాందోళనకు గురైన తాను టోర్నీని సరిగా ఆడలేకపోయానని టైమ్స్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది.

తన సోదరి అంటే తనకు చాలా ఇష్టమని, తన సోదరిని దారుణంగా చంపిన వ్యక్తి బయటకు వచ్చాడంటే మనసులో భయం ఏర్పడిందని, సోదరి పిల్లల గురించే తన బాధ అంతా అని సెరీనా చెప్పింది. సోదరి ఎటుండే ప్రైస్‌ హత్య తర్వాత, ఆమె 11, 9, 5 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలను సెరీనానే పెంచుతోంది.

ఎటుండే ప్రైస్‌ ని 2003లో హంతకుడు రొబెర్ట్‌ మ్యాక్స్‌ఫీల్డ్‌ లాస్‌ ఎంజెల్స్‌లో తుపాకీతో కాల్చి చంపాడు. దీంతో నిందితుడికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించారు. సిలికాన్‌ వ్యాలీ క్లాసిక్‌ టోర్నీ సమయంలో ఆ హంతకుడు పెరోల్ పై రావటంతో ఊహించని విధంగా తొలి రౌండ్‌లోనే సెరీనా అత్యంత దారుణంగా ఓటమి పాలయ్యింది. బ్రిటన్‌ క్రీడాకారిణి జొహన్నా కొంటా చేతిలో 6-1, 6-0తో సెరీనా పరాజయం చెందింది. ఇది ఆమె కెరీర్‌లోనే అత్యంత ఘోర పరాజయం.  

More Telugu News