Vijay Devarakonda: క్రాకర్ బాక్స్ పై సమంత ఫొటో... పోస్టు చేసి సంబరాలన్న విజయ్ దేవరకొండ!

  • మూడో సూపర్ హిట్ సాధించిన విజయ్
  • సమంత ఫొటో పెట్టి సెలబ్రేషన్స్
  • స్పందించిన సమంత
తన కెరీర్ లో మూడో సూపర్ హిట్ ను సాధించిన ఆనందంలో ఉన్న విజయ్ దేవరకొండ, తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. "నా ఫేవరేట్‌ సమంతతో కలిసి సెలబ్రేట్‌ చేసుకుంటున్నా" అంటూ సమంత ముఖ చిత్రం ఉన్న ఓ కాకరపూవొత్తుల పెట్టె ఫొటోను షేర్ చేసుకున్నాడు. దీన్ని చూసిన సమంత స్పందిస్తూ, "నీ సెలబ్రేషన్‌లో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది" అని బదులిచ్చింది. వీరిద్దరూ 'మహానటి'లో జోడీగా కనిపించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల నాడు విడుదలైన 'గీత గోవిందం' తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని దూసుకెళుతోంది.
Vijay Devarakonda
Mahanati
Samantha
Geeta Govindam

More Telugu News