manchu vishnu: వినాయక్ దర్శకత్వంలో మంచు హీరో?

  • 'ఓటర్' సినిమా పనుల్లో మంచు విష్ణు 
  • నెక్స్ట్ ప్రాజెక్టుపై దృష్టి 
  • వినాయక్ తో సంప్రదింపులు
ప్రస్తుతం మంచు విష్ణు .. 'ఓటర్' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు. అయితే పరశురామ్ వేరే నిర్మాతల దగ్గర ముందుగానే అడ్వాన్స్ తీసుకోవడం వలన, ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది చెప్పలేం.

అందువలన వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి మంచు విష్ణు ఉత్సాహాన్ని చూపుతున్నాడని అంటున్నారు. బాలకృష్ణ తదుపరి సినిమా చేయడం కోసం అందుకు సంబంధించిన సన్నాహాలను వినాయక్ సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ ను పూర్తి చేయడానికి సమయం పడుతుంది. ఈలోగా ఒక సినిమా చేయాలనుకుంటే వినాయక్ చేసేయొచ్చు. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 
manchu vishnu
vinayak

More Telugu News