Vajpayee: డాక్టరేట్ నుంచి భారతరత్న వరకూ... వాజ్ పేయిని వరించిన అవార్డులు!

  • వాజ్ పేయి సేవలకు గుర్తింపుగా అవార్డులు
  • 1994లో ఔట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డు
  • 'లిబరేషన్ వార్ ఆనర్' ప్రకటించిన బంగ్లాదేశ్
నిన్న దివంగతులైన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిని జీవితంలో ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు వరించాయి. ఆయన దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా లభించిన అవార్డులను పరిశీలిస్తే...

1992లో భారత ప్రభుత్వం వాజ్ పేయికి పద్మ విభూషణ్ అవార్డును ఇచ్చి సత్కరించింది. ఆపై 1993లో కాన్పూర్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ను అందించింది. 1994లో లోకమాన్య తిలక్ అవార్డు, ఔట్ స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డు, పండిట్ గోవింద్ వల్లభాయ్ పంత్ అవార్డులు ఆయన్ను వరించాయి. 2015లో భారత ప్రభుత్వం భారతరత్న అవార్డును ఇవ్వగా, అదే సంవత్సరం బంగ్లాదేశ్ ప్రభుత్వం 'లిబరేషన్ వార్ ఆనర్' అవార్డును ఇచ్చి సత్కరించింది.
Vajpayee
Awards
Bharataratna

More Telugu News