Pakistan: వాజ్‌పేయి పోటీ చేస్తే పాకిస్థాన్‌లోనూ గెలుస్తారు.. నవాజ్ షరీఫ్ చమత్కారం!

  • పాక్ ప్రజల హృదయాలను గెలుచుకున్న మాజీ ప్రధాని
  • వద్దంటున్నా మినార్-ఎ-పాకిస్థాన్ సందర్శన
  • పాక్ అస్తిత్వానికి తన స్టాంపు అవసరం లేదని వ్యాఖ్య

వాజ్‌పేయి సాబ్ ఇప్పుడు పాకిస్థాన్ ఎన్నికల్లోనూ గెలుస్తారు.. ఈ మాటన్నది అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్. పొరుగు దేశం అభిమానాన్ని అంతగా సంపాదించుకున్న నేత వాజ్‌పేయి మాత్రమే. 1999లో వాజ్‌పేయి పాక్ పర్యటనపై సర్వత్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఇక పాక్‌లోని రాజకీయ పార్టీలు, మత ఛాందసవాదులు అయితే అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అయినా, వాజ్‌పేయి వెనక్కి తగ్గలేదు. 1947లో పాకిస్థాన్ ఆవిర్భావానికి ప్రతీకగా నిర్మించిన ‘మినార్-ఎ-పాకిస్థాన్’ను సందర్శించారు.

మినార్‌ను సందర్శించవద్దని తనకు ఎంతోమంది చెప్పారని, అక్కడికి వెళ్తే పాకిస్థాన్‌కు ఆమోదముద్ర వేసినట్టు అవుతుందన్నారని వాజ్‌పేయి పేర్కొన్నారు. పాకిస్థాన్ అస్తిత్వానికి తన స్టాంపు అవసరం లేదన్న విషయాన్ని వాళ్లకు స్పష్టంగా చెప్పానంటూ పాక్ హృదయాలను దోచుకున్నారు. ఈ సందర్భంగా అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ వాజ్‌పేయి సాబ్ కనుక పోటీ చేస్తే పాకిస్థాన్‌లోనూ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. వాజ్‌పేయి ప్రజాదరణకు ఇది తిరుగులేని సాక్ష్యం.

More Telugu News