vajpayee: వాజ్ పేయి మృతిపై సినీ రంగ ప్రముఖుల సంతాపం

  • బాలీవుడ్ ,టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖుల సంతాపం
  • మహానేత, గొప్పకవి, వక్తకు శ్రద్ధాంజలి: అమితాబ్
  • తీవ్ర దు:ఖాన్ని కలిగించింది - రజనీకాంత్ 

భారత మాజీ ప్రధాని వాజ్ పేయి మృతిపై బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన అగ్రనటులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

మహానేత, గొప్పకవి, వక్తకు శ్రద్ధాంజలి -  అమితాబ్ బచ్చన్

వాజ్ పేయి మరణవార్త తీవ్ర దు:ఖాన్ని కలిగించింది - రజనీకాంత్

నేను చూసిన ఉత్తమ ప్రధానుల్లో వాజ్ పేయి ఒకరు. దేశం ఎన్నడూ చూడని గొప్ప ప్రధాని వాజ్ పేయి - నటుడు మోహన్ లాల్

దేశం ఓ గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది. స్వర్ణ చతుర్భుజి ద్వారా దేశాన్ని అనుసంధానం చేసిన దార్శనికుడు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు వాజ్ పేయి - జూనియర్ ఎన్టీఆర్

గొప్ప మనిషిని కోల్పోయాం. వాజ్ పేయి ఇక లేరన్న వార్త తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. వాజ్ పేయి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి - నటుడు ధనుష్ 

 రాజకీయాలకు వన్నె తెచ్చిన అతికొద్ది మంది రాజనీతిజ్ఞుల్లో వాజ్ పేయి ఒకరు. రహదారుల అనుసంధానం అనే ఆయన విజన్ దేశంలో బతుకుతున్న లక్షలాది మంది జీవితాలను మార్చివేసింది. నా ప్రియమైన నేతకు శిరసు వంచి నమస్కరిస్తున్నా - దర్శకుడు రాజమౌళి

నిజమైన నాయకుడు, యావత్తు భారతదేశం మిమ్మల్ని కోల్పోయింది. వాజ్ పేయి జ్ఞానం, నిజాయతీ.. ప్రతి రాజకీయ నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి - దర్శకుడు కొరటాల శివ 

More Telugu News