modi: వాజ్ పేయి నివాసం వద్దకు మోదీ.. చేరుకుంటున్న కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు

షార్ట్స్‌లో చూడండి
 కాసేపటి క్రితం ఎయిమ్స్ ఆసుపత్రికి వచ్చి, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడిన ప్రధానిమోదీ... అక్కడ నుంచి నేరుగా వాజ్ పేయి నివాసం వద్దకు చేరుకున్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలంతా వాజ్ పేయి నివాసం వద్దకు చేరుకుంటున్నారు. ఎయిమ్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా మోదీ ఎంతో ఆవేదనగా కనిపించారు.

మరోవైపు, ఎయిమ్స్ ఆసుప్రతి ఆవరణలో ఉన్న వాహనాలను సిబ్బంది ఖాళీ చేయించారు. వాజ్ పేయి నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయడమే కాక, ట్రాఫిక్ ను మళ్లించారు. ఈ నేపథ్యంలో, వాజ్ పేయి ప్రస్తుత స్థితిపై ఆందోళన మరింత తీవ్రతరమైంది. కాసేపట్లో ఎయిమ్స్ వైద్యులు కీలకమైన హెల్త్ బులెటిన్ ను విడుదల చేయనున్నారు.
Go Back to Shorts
modi
vajpayee

More Telugu News