kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన బర్త్ డే వేడుకలకు దూరం!

షార్ట్స్‌లో చూడండి
నేడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పుట్టినరోజు. అయితే, తన బర్త్ డే వేడుకలకు మాత్రం ఆయన దూరంగా ఉన్నారు. తన మద్దతుదారులకు కూడా తన బర్త్ డే వేడుకలు నిర్వహించొద్దని కోరారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేశారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసం వద్దకు ఆయన్ని అభినందించేందుకు వెళ్లిన మద్దతుదారులకు ఆయన ఓ విజ్ఞప్తి  చేశారు.

 మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి విషమించడం, కేరళలో వరద బీభత్సం పరిస్థితుల కారణంగా తన బర్త్ వేడుకలు నిర్వహించొద్దని కోరారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రాన్ని ఆదుకునే నిమిత్తం దయతో విరాళాలు ఇవ్వాల్సిందిగా సూచించారు. కాగా, ప్రధాని మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితరులు తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా కేజ్రీవాల్ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.
Go Back to Shorts
kejriwal
birthday

More Telugu News