Pawan Kalyan: జగన్ హామీలకు కేంద్ర బడ్జెట్ కూడా సరిపోదు: కేఈ ఎద్దేవా

  • సీఎం కావాలనే కోరికతో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు
  • రాజన్న రాజ్యమంటే.. అధికారులను జైలుకు పంపడమా?
  • రెచ్చగొట్టే విధంగా పవన్ మాట్లాడుతున్నారు

రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే తపనలో వైసీపీ అధినేత జగన్ ఉన్నారని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. సీఎం సీటులో కూర్చోవాలన్న కోరికతో ఆచరణ సాధ్యంకాని ఎన్నో హామీలను ఇస్తున్నారని విమర్శించారు. జగన్ ఇస్తున్న హామీలను నెరవేర్చాలంటే కేంద్ర బడ్జెట్ కూడా సరిపోదని అన్నారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులను సృష్టించినా... రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నారని కేఈ చెప్పారు. బీజేపీకి జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. బీజేపీ అంటే బ్రోకర్స్ ఆఫ్ జగన్ అండ్ పవన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తామని జగన్ చెబుతున్నారని... రాజన్న రాజ్యమంటే అధికారులను జైలుకు పంపడమా? అని ఎద్దేవా చేశారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా పవన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

More Telugu News