AIMMS: కాసేపట్లో వాజ్ పేయి హెల్త్ బులెటిన్... బీజేపీలో తీవ్ర ఉత్కంఠ!

  • ఎయిమ్స్ ముందు భద్రత కట్టుదిట్టం
  • సాధారణ రోగుల బంధువులకు అనుమతి నిరాకరణ
  • వాజ్ పేయి ఆరోగ్యంపై కార్యకర్తల్లో ఆందోళన

న్యూఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్ ముందు ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి ఆరోగ్యంపై మరికాసేపట్లో వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేయనుండగా, అందులో ఏం ఉంటుందోనని బీజేపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేయడం, ఆసుపత్రిలోని సాధారణ రోగుల బంధువులను లోనికి అనుమతించక పోవడంతో కార్యకర్తల్లో ఆందోళన పెరుగుతోంది.

వాజ్ పేయి ఆరోగ్యం విషమించిందని నిన్న హెల్త్ బులెటిన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు కృత్రిమ శ్వాసను అందిస్తున్నామని, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు పనిచేయడం లేదని వైద్యులు చెప్పడంతో, ఏ క్షణంలో దుర్వార్త వినాల్సి వస్తుందోనని కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. నేడు 12 గంటల్లోపు హెల్త్ బులెటిన్ ఇస్తామని ఎయిమ్స్ అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News