kcr: మళ్లీ మన తెలంగాణ చెరువుల్లో ఎర్ర రొయ్యలు పుట్టాలి: సీఎం కేసీఆర్

  • ‘మిషన్ కాకతీయ’తో చెరువులను బాగు చేసుకున్నాం
  • 365 రోజులు చెరువుల్లో నీరుండేలా చేసుకున్నాం
  • బంగారు తెలంగాణ దిశగా మనం పయనించాలి

మిషన్ కాకతీయ ద్వారా మన చెరువులను బాగు చేసుకున్నామని, 365 రోజులు చెరువుల్లో నీరు ఉండేలా ఏర్పాటు చేసుకున్నామని, మళ్లీ మన తెలంగాణ చెరువుల్లో ఎర్ర రొయ్యలు పుట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని మల్కాపూర్ లో ‘కంటి వెలుగు’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, గతంలో రాష్ట్రంలో ఎన్నో బాధలు పడ్డామని, కష్టాలు పడి పంటలు వేస్తే.. బోరు పడేదు కాదు, విద్యుత్ సరఫరా ఉండేది కాదని, రైతులు బాధలు పోగొట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆ బాధలు పోవాలంటే గోదావరి, కృష్ణా నీరు మనకు అందాలని, బంగారు తెలంగాణ దిశగా మనం పయనించాలని కేసీఆర్ అన్నారు. 

  • Loading...

More Telugu News