manikarnika: ‘మణి కర్ణిక’ ఫస్ట్ లుక్ విడుదల.. కదనరంగంలో సింహంలా గర్జిస్తున్న కంగన!

  • ఫస్ట్ లుక్ విడుదల చేసిన సినిమా యూనిట్
  • తెలుగు, హిందీ సహా పలు భాషల్లో విడుదల
  • జనవరి 25న రిలీజ్ కు నిర్మాతల సన్నాహాలు

బ్రిటిష్ వారిని 1857 తిరుగుబాటు సందర్భంగా గడగడలాడించిన రాణి లక్ష్మీ బాయి జీవితం ఆధారంగా దర్శకుడు క్రిష్ ‘మణి కర్ణిక- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రోజు మణికర్ణిక ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది.


వీపుపై కుమారుడిని కట్టుకుని రక్తంతో తడిసిన కత్తితో ఆంగ్లేయులపై సింహ గర్జన చేస్తున్న కంగనా లుక్ సినిమాపై అంచనాను అమాంతంగా పెంచేస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్(బాహుబలి కథా రచయిత) కథను అందించారు. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదల కానుంది. వచ్చే ఏడాది జనవరి 25న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.

More Telugu News