karunanidhi: పళనిస్వామి చేతులు పట్టుకుని వేడుకున్నా.. అయినా కనికరించలేదు: స్టాలిన్ ఆగ్రహం

  • అన్నాదురై సమాధి పక్కనే తనదీ వుండాలన్నది కరుణ కోరిక
  • హైకోర్టు తీర్పు వెనుక ఘనత లాయర్లదే
  • అదే జరగకపోతే.. నేను కూడా సమాధి అయ్యేవాడిని

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ నిప్పులు చెరిగారు. మెరీనా బీచ్ లో అన్నాదురై సమాధి పక్కన ఆయన సమాధిని ఏర్పాటు చేయాలన్నది దివంగత కరుణానిధి కోరికని... కలైంజ్ఞర్ అంతిమ ఘడియల్లో ఆయన చివరి కోరికను పళనిస్వామి దృష్టికి తీసుకొచ్చానని, చేతులు పట్టుకుని వేడుకున్నానని, అయినా తన అభ్యర్థనను అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తోసిపుచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు స్పందించారు.

ఒక దిగ్గజ నేతను డీఎంకే కోల్పోతే, తాను తండ్రిని కూడా కోల్పోయానని ఈ సందర్భంగా స్టాలిన్ కంటతడి పెట్టారు. కరుణ ఆశయ సాధన కోసం పార్టీ కార్యకర్తలంతా కృషి చేయాలని చెప్పారు. మెరీనా బీచ్ లో కరుణ అంత్యక్రియలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక పూర్తి క్రెడిట్ లాయర్లకే దక్కుతుందని అన్నారు. అదే జరగకపోయి ఉంటే తమ నేతతో పాటు తాను కూడా సమాధి అయి ఉండేవాడినని భావోద్వేగంతో చెప్పారు. కరుణ ఆశయాల సాధన కోసం అందరం కలసి పని చేద్దామని పిలుపునిచ్చారు. 

More Telugu News