Amaravati: బీఎస్ఈలో అమరావతి బాండ్లు... మంచి డిమాండ్ కనిపించడంతో సీఆర్డీయే అనందం!

  • ఈ ఉదయం విక్రయాలు ప్రారంభం
  • 600 బాండ్లు కొన్న ఇన్వెస్టర్
  • 10.38 శాతం వడ్డీని చెల్లించనున్న ఏపీ సర్కారు

ఈ ఉదయం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ లో అమరావతి బాండ్ల విక్రయం ప్రారంభం కాగా, ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన కనిపించడంతో సీఆర్డీయే (కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ) అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి నిధుల సమీకరణ నిమిత్తం రూ. 1,300 కోట్లను సేకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ బాండ్లను జారీ చేసిన సంగతి తెలిసిందే.

బీఎస్ఈలో బాండ్ల అమ్మకం ప్రారంభం కాగానే ఓ ఇన్వెస్టర్ 600 బాండ్లను కొనేశాడు. ఒక్కో బాండ్ విలువ రూ. 10 లక్షలు కాగా, ఆ ఇన్వెస్టర్ రూ. 60 కోట్లను పెట్టుబడిగా పెట్టాడు. ఇక ఈ బాండ్లపై ప్రభుత్వం సాలీనా 10.38 శాతం వడ్డీని చెల్లించనుంది. అందుకు ప్రభుత్వమే స్వయంగా కౌంటర్ గ్యారెంటీ ఇస్తుంది. ఈ బాండ్ల విక్రయంలో టార్గెట్ ను చేరుకుంటే, మరో రూ. 700 కోట్ల విలువైన రిటైల్ బాండ్లను విక్రయించాలని కూడా ఏపీ సర్కారు భావిస్తోంది.

More Telugu News